అయ్యో..! అవంతిక..! | small Reckless child killed | Sakshi
Sakshi News home page

అయ్యో..! అవంతిక..!

Mar 24 2016 3:18 AM | Updated on Sep 3 2017 8:24 PM

అయ్యో..! అవంతిక..!

అయ్యో..! అవంతిక..!

తండ్రి ఏమరుపాటుతో తన మూడేళ్ల కూతురుకి అప్పుడే నూరేళ్లు నిండారుయి.

చిరు నిర్లక్ష్యంతో చిన్నారి దుర్మరణం
రివర్స్ తీస్తుండగా బాలికను తొక్కిన ట్రాక్టర్
తల పగిలి మృతి చెందిన మూడేళ్ల బాలిక

 
తిమ్మాపూర్ : తండ్రి ఏమరుపాటుతో తన మూడేళ్ల కూతురుకి అప్పుడే నూరేళ్లు నిండారుయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె దూరం కావడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటారుు. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన వేల్పుల రమేష్ అదే గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఎప్పటిలాగే రమేష్ మంగళవారం ట్రాక్టర్‌ని తన ఇంటి ముందు పెట్టుకున్నాడు. బుధవారం ఉదయం చెడిపోయిన బ్యాటరీని తొలగించి వేరే బ్యాటరీ బిగించి వెనక్కి తీస్తున్నాడు. ఆయన కూతురు అవంతిక(3) ట్రాక్టర్ వెనుక బహిర్భూమికి కూర్చుతుంది. ఇది గమనించని రమేష్ ట్రాక్టర్‌ను వెనక్కు తీయడంతో అవంతికపై నుంచి వెళ్లగా ఆమె తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వేల్పుల రమేష్, స్వప్న దంపతులకు అవంతిక ఒక్కతే కూతురు.

Advertisement
 
Advertisement
Advertisement