ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్ | Sarpanch ibrahimpur in Mussoorie | Sakshi
Sakshi News home page

ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్

Mar 18 2016 2:29 AM | Updated on Sep 3 2017 7:59 PM

ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్

ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్

ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం

గ్రామాభివృద్ధిపై ప్రసంగం
 

సిద్దిపేట రూరల్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి పాల్గొన్నారు. గురువారం జరిగిన ఆ సమావేశంలో గ్రామాభివృద్ధిపై ఆమె ప్రసంగించారు. ఇటీవల ముస్సోరీ ఐఏఎస్ అకాడమీ. ‘డీసెంట్రలైజేషన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్’పై ప్రసంగించేందుకు రావాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సర్పంచ్‌ను ఆహ్వానించిన విష యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సర్పంచ్ లక్ష్మి ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల విధానం, చెట్ల పెంపకం, పారిశుద్ధ్యంతో పాటు గ్రామ అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలపై ఐఏఎస్ అకాడమీలో ప్రసంగించారు. ఆమె వెంట డీపీవో సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement