ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరి యత్నం జరిగింది.
గ్రామీణ వికాస్ బ్యాంక్ లో లాకర్ ధ్వంసం
Jan 14 2016 10:19 AM | Updated on Aug 30 2018 5:27 PM
ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరి యత్నం జరిగింది. మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దుండుగులు చోరీకి విఫల యత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి బ్యాంక్ లోకి ప్రవేశించిన దొంగలు లాకర్ ను పగులకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Advertisement


