లక్ష ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదు: ఆర్.కృష్ణయ్య | r. krsihnaiah statements on bc mps | Sakshi
Sakshi News home page

లక్ష ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదు: ఆర్.కృష్ణయ్య

Jun 12 2015 5:43 PM | Updated on Sep 3 2017 3:38 AM

లక్ష ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదు: ఆర్.కృష్ణయ్య

లక్ష ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదు: ఆర్.కృష్ణయ్య

లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.

సంగారెడ్డి (మెదక్): లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అదే విధంగా పార్లమెంట్‌లో బీసీల సమస్యలను ప్రస్తావించని వెనుకబడిన కులాలకు చెందిన ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని  సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగా మారుతారని ఆయన అన్నారు. 

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను బీసీల సమస్యలపై నిలదీస్తామని ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా చెప్పారు.  వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని పేర్కొంటూ చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌ను ముట్టడిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement