కూకట్‌పల్లిలో వ్యభిచార గృహం గుట్టు రట్టు | police arrested procestutes in kukatpalli | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో వ్యభిచార గృహం గుట్టు రట్టు

Nov 17 2017 1:50 PM | Updated on Nov 17 2017 2:07 PM

police arrested  procestutes in kukatpalli - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారికి హైదరాబాద్‌ పోలీసులు చెక్‌పెడుతున్నారు. వరుసగా వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు.

కూకట్‌పల్లి 6వ ఫేజులో వ్యభిచారం నడుస్తోందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.లక్షా 32 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈదాడుల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఫోన్‌ ద్వారా విటులకు గాలం వేస్తారు. అనంతరం రేటు మాట్లాడుకొని వ్యభిచార గృహానికి పంపిస్తారు. గత కొద్ది నెలలుగా గుట్టు చప్పడుకాకుండా, ఇరుగు పొరుగుకు ఏమాత్రం అనుమానం రాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement