పరమేశ్వరా...గంగవిడువరా..! | people prayer for god because of rain | Sakshi
Sakshi News home page

పరమేశ్వరా...గంగవిడువరా..!

Jun 17 2014 2:08 AM | Updated on Aug 29 2018 9:29 PM

పరమేశ్వరా...గంగవిడువరా..! - Sakshi

పరమేశ్వరా...గంగవిడువరా..!

కొన్ని వందల ఏళ్ల కిందట దేశాటన చేస్తున్న శ్రీనాథమహాకవికి కొన్ని ప్రాంతాల్లో సంధ్యవార్చేందుకు ఉపక్రమిస్తే నీరు కనిపించ లేదట.

కొన్ని వందల ఏళ్ల కిందట దేశాటన చేస్తున్న శ్రీనాథమహాకవికి కొన్ని ప్రాంతాల్లో సంధ్యవార్చేందుకు ఉపక్రమిస్తే నీరు కనిపించ లేదట. దీంతో ఆయన ‘తిరుపమెత్తువానికి ఇద్దరు భార్యలెందుకు..పార్వతి చాలున్, గంగన్ విడువుము పరమేశా’ అంటూ ఓ చాటువును చెప్పాడట. దీంతో శివుడు కనికరించి జలాలను అందించాడట. ఇప్పుడు జిల్లాలో విత్తనాలు వేసి వానలు కోసం ఎదురు చూస్తున్న  రైతులకు చినుకులు రాలక కలవర పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఆత్మకూర్ చెరువులోని పరమేశ్వర స్వామికి స్థానికులు కృష్ణాజలాలను తెచ్చి అభిషేకించారట. బండెనక బండికట్టి 121 బిందెలతో నీరు తెచ్చి గంగాధరుడిని వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎం.గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు.             
-ఆత్మకూర్
 

Advertisement
 
Advertisement
Advertisement