కృష్ణా డెల్టాకు నీటి విడుదల | Nagarjuna Sagar reservoir Water Release to Krishna Delta | Sakshi
Sakshi News home page

కృష్ణా డెల్టాకు నీటి విడుదల

Mar 12 2016 3:41 AM | Updated on Oct 19 2018 7:22 PM

తాగు నీటి అవసరాల మేరకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు శుక్రవారం నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ :  తాగు నీటి అవసరాల మేరకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు  శుక్రవారం నీటిని విడుదల చేశారు.విద్యుత్ ఉత్పాదక కేంద్రం ద్వారా 7 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి నాలుగున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా... ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీవరకు రెండు టీఎంసీల నీరు విడుదల చేశారు. మిగిలిన రెండున్నర టీఎంసీలు పూర్తి అయ్యే వరకూ నీటి విడుదల కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement