ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం | Man attempts rape on 7 years old girl | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Mar 8 2016 2:58 PM | Updated on Jul 28 2018 8:51 PM

నేరేడుచర్ల మండలం దాసారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన సైదులు(25) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం అత్యాచారయత్నం చేశాడు.

నేరేడుచర్ల (నల్గొండ జిల్లా) : నేరేడుచర్ల మండలం దాసారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన సైదులు(25) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం అత్యాచారయత్నం చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు  మాయమాటలు చెప్పి పక్కింట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించడంతో బాలిక కేకలు వేసింది. కేకలు విన్న బాలిక తల్లి సహా ఇరుగుపొరుగువారు పరిగెత్తుకురావడంతో బాలికను వదిలేసి నిందితుడు పరుగుతీశాడు. ఈమేరకు బాలిక తల్లిదండ్రులు నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement