బావిలో పేలుడు : ఇద్దరికి తీవ్రగాయాలు | Detonator explodes in Well | Sakshi
Sakshi News home page

బావిలో పేలుడు : ఇద్దరికి తీవ్రగాయాలు

Jun 5 2015 7:49 PM | Updated on Sep 3 2017 3:16 AM

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ప్రమాదవశాత్తు బావిలో పేలుడు సంభవించి ఇద్దరు తీవ్రంగాను, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

మానకొండూరు (కరీంనగర్) :  కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ప్రమాదవశాత్తు బావిలో పేలుడు సంభవించి ఇద్దరు తీవ్రంగాను, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే .. మండలంలోని ఈదులగట్టుపెల్లి గ్రామానికి చెందిన మీస లచ్చవ్వ అనే రైతుకు చెందిన బావిలో శుక్రవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లాకు చెందిన కూలీలు పూడిక తీస్తున్నారు. అయితే బావిలో అంతకుమునుపే ఉన్న డిటొనేటర్‌కు గడ్డపార తగలటంతో అది పేలింది. దీంతో పనులు చేస్తున్న శ్రీనివాస్, మల్లేష్ అనే ఇద్దరు తీవ్రంగాను, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement