సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై అత్యాచార యత్నం | Rape Attempt on Software Engineer in Bangalore city | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై అత్యాచార యత్నం

Jun 8 2014 8:57 AM | Updated on Jul 28 2018 8:51 PM

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై అత్యాచార యత్నం - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై అత్యాచార యత్నం

జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన యువతి (25) ఈ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.
 
శుక్రవారం రోజు  దుండగులు హాస్టల్‌లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement