లైంగికంగా వేధించారంటూ నటి ఫిర్యాదు | kannada tv actress Meghana gowda Complains of sexual harassment | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధించారంటూ నటి ఫిర్యాదు

Nov 5 2016 6:26 PM | Updated on Sep 26 2018 6:09 PM

లైంగికంగా వేధించారంటూ నటి ఫిర్యాదు - Sakshi

లైంగికంగా వేధించారంటూ నటి ఫిర్యాదు

లైంగిక వేధింపులపై కన్నడ బుల్లితెర నటి మేఘన పోలీసుల్ని ఆశ్రయించింది.

బెంగళూరు : లైంగిక వేధింపులపై కన్నడ బుల్లితెర నటి మేఘన పోలీసుల్ని ఆశ్రయించింది. తన ఇంట్లోకి నలుగురు యువకులు చొరబడి దాడి చేసి లైంగికంగా వేధించారంటూ ఆమె శుక్రవారం రాజరాజేశ్వరినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం తన ఇంటికి దర్శన్, నవీన్, పృధ్వీ, వినూతన్ అనే నలుగురు యువకులు ప్రవేశించి లైంగికంగా వేధించి అనంతరం విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని మేఘన తన ఫిర్యాదులో తెలిపింది.

కాగా కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బుల్లితెర నటుడు హరీశ్ తో కొన్నేళ్లుగా మేఘన సహజీవనం చేసింది. అయితే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుండగా హరీశ్ మృతి చెందాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీశ్ను చూసేందుకు కూడా మేఘన రాకపోవడంతో అతడి సోదరుడు నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల మేఘన ఇంటికి వచ్చిన నవీన్...తన అన్న కారు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కారుతో పాటు కొంత నగదును మేఘన నవీన్​కు పంపించింది. ఈ నేపథ్యంలో తన ఇంటిపై దాడి చేసి వేధించారంటూ మేఘన చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement