అందరూ సెక్స్‌ వర్కర్ల కూతుళ్లే.. | Daughters of sex workers tell their stories on UK stage | Sakshi
Sakshi News home page

అందరూ సెక్స్‌ వర్కర్ల కూతుళ్లే..

Aug 27 2017 9:47 AM | Updated on Oct 17 2018 5:10 PM

అందరూ సెక్స్‌ వర్కర్ల కూతుళ్లే.. - Sakshi

అందరూ సెక్స్‌ వర్కర్ల కూతుళ్లే..

సెక్స్‌ వర్కర్ల పిల్లలు ఏమవుతారు?.

సాక్షి, లండన్‌: సెక్స్‌ వర్కర్ల పిల్లలు ఏమవుతారు?. వెకిలిగా ఆలోచిస్తే వాళ్లూ సెక్స్‌ వర్కర్లే అవుతారు అనే మాటలు వినిపిస్తాయి. కానీ వాళ్లకు ఆశలు, ఆశయాలు ఉంటాయనే విషయాన్ని ఎంత మంది గ్రహిస్తారు. వారికి దిశానిర్దేశం చేసి ఎవరు ప్రోత్సహిస్తారు?. అందుకు మేం ఉన్నాం అంటోంది.. లాల్‌ బత్తి ఎక్స్‌ప్రెస్‌(రెడ్‌ లైట్‌ ఎక్స్‌ప్రెస్‌).

బ్రిటన్‌లోని ఎడిన్‌ బర్గ్‌ ఫ్రింజ్‌లో గల ఓ చర్చిలో ముంబై రెడ్‌ లైట్‌ ఏరియాలో సెక్స్‌ వర్కర్లుగా పని చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలతో ఓ స్టేజ్‌ పర్ఫార్మెన్స్‌ ఇప్పించింది రెడ్‌ లైట్‌ ఎక్స్‌ప్రెస్‌. వారి ఆశయాలను, కోరికలను, కలలను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఆర్ట్‌ ఫెస్టివల్‌ను వేదికగా మార్చింది.

స్టేజ్‌ మీద కూర్చున్న 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరూ తమ ఊహలను, వాస్తవాలను కళ్లకు కట్టేలా ఇచ్చే ఈ ప్రదర్శనలకు 'రైలు ప్రయాణం' అనే పేరు కూడా పెట్టింది. రెడ్‌ లైట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎన్‌జీవో క్రాంతి అండగా నిలుస్తోంది. లండన్‌లోని పలు ప్రాంతాల్లో పిల్లలు తాము అనుభవించిన కష్టాలను అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బీబీసీ చానెల్‌ పిల్లల నుంచి ప్రత్యేకంగా ఇంటర్వూ తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement