సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం | WTA: Sania Mirza continues to dominate doubles ranking | Sakshi
Sakshi News home page

సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం

Sep 27 2016 2:45 AM | Updated on Sep 4 2017 3:05 PM

సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం

సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత స్టార్ సానియా మీర్జా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత స్టార్ సానియా మీర్జా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సానియా... సోమవారం విడుదల చేసిన డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో 9730 పారుుంట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉంది. గత ఏడాది ఏప్రిల్ రెండో వారంలో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ఇప్పటివరకు అదే స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 138వ స్థానానికి చేరుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ 229వ స్థానంలో, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 18వ, లియాండర్ పేస్ 60వ ర్యాంక్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement