క్వార్టర్స్‌లో హంపి ఓటమి | World Women Chess Championship: Dronavalli Harika in Semifinals; Koneru Humpy Forces Tie-Breaker | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో హంపి ఓటమి

Mar 29 2015 2:43 AM | Updated on Sep 2 2017 11:31 PM

క్వార్టర్స్‌లో హంపి ఓటమి

క్వార్టర్స్‌లో హంపి ఓటమి

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన రెండు గేమ్‌ల్లో 1-1తో సమ ఉజ్జీగా నిలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న హంపి... శనివారం జరిగిన టైబ్రేక్‌లో మాత్రం 0.5-1.5తో పరాజయం పాలైంది.

తొలి టైబ్రేక్‌ను నల్లపావులతో ఆడిన హంపి 58 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. రెండో టైబ్రేక్‌లో మాత్రం మరియా ఎత్తులకు చిత్తయ్యింది. తెల్లపావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించింది. సెమీఫైనల్ పోరులో ఏపీ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో మరియా తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement