ఆసీస్ కష్టమేనా? | will australi stand in semis race | Sakshi
Sakshi News home page

ఆసీస్ కష్టమేనా?

Jun 6 2017 8:22 PM | Updated on Sep 5 2017 12:57 PM

ఆసీస్ కష్టమేనా?

ఆసీస్ కష్టమేనా?

చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన జట్టు ఆస్ట్రేలియా. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాను వరుణ గండం భయపెడుతోంది.

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన జట్టు ఆస్ట్రేలియా. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాను వరుణ గండం భయపెడుతోంది. ఇప్పటికే ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో ఆ జట్టు పరిస్ధితి సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో మాత్రమే ఉన్న ఆసీస్ కు ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. శనివారం ఇంగ్లండ్ తో జరిగే కీలక పోరుకు ఆసీస్ సన్నద్ధమవుతోంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిచినప్పటికీ సెమీస్ కు చేరే అవకాశాలు ఎంతవరకూ ఉంటాయనేది చెప్పడం కష్టం. గ్రూప్-ఎలో ఉన్న ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ మంచి దూకుడుగా ఉన్న సమయంలో భారీ వర్షం పడింది. దాంతో మ్యాచ్ ను రద్దు చేయడంతో ఆసీస్ ఖాతాలో కేవలం పాయింట్ మాత్రమే చేరింది. అంతకుముందు న్యూజిలాండ్ తో ఆసీస్ ఆడిన మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఆసీస్ కచ్చితంగా గెలవడంతో పాటు మెరుగైన రన్ రేట్ ను కాపాడుకోవాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ కూడా బలంగానే ఉండటంతో ఆసీస్ గెలుపు అంత ఈజీ కాదు. ఇప్పటివరకూ ఆసీస్ కు ఎటువంటి రన్ రేట్ లభించలేదు. రద్దయిన మ్యాచ్ ల్లో ప్రత్యర్ధి జట్లతో కలిసి పాయింట్లను ఆసీస్ పంచుకున్నా రన్ రేట్ అయితే ఏమీ లేదు. ఇక చివరి మ్యాచ్ లో వరుణుడు కరుణిస్తేనే ఆసీస్ సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే మాత్రం ఆసీస్ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టకతప్పదు.

Advertisement
 
Advertisement
Advertisement