టి20 కూడా ఇంగ్లండ్‌దే | T-20 is also to england | Sakshi
Sakshi News home page

టి20 కూడా ఇంగ్లండ్‌దే

Jun 25 2015 2:55 AM | Updated on Sep 3 2017 4:18 AM

శ్వాసాన్ని మరింత పెంచుకుంది. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన మోర్గాన్ సేన...

న్యూజిలాండ్‌పై 56 పరుగుల విజయం
 
 మాంచెస్టర్ : యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన మోర్గాన్ సేన... ఏకైక టి20లోనూ మెకల్లమ్ బృందాన్ని మట్టికరిపించింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగులతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతున్న జో రూట్ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.

స్టోక్స్ (24 నాటౌట్), హేల్స్ (27) రాణించారు. కివీస్ బౌలర్లలో శాంటర్, మెక్లీనగన్ రెండేసి వికెట్లు తీశారు. న్యూజిలాండ్ జట్టు 16.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. విలియమ్సన్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), బ్రెండన్ మెకల్లమ్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. 46 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున తొలి అంతర్జాతీయ టి20 ఆడిన విల్లీ, వుడ్ మూడేసి వికెట్లు తీశారు. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement