కోల్ కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 161 | sunrisers hyderabad set target of 161 runs for kolkata | Sakshi
Sakshi News home page

కోల్ కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 161

May 24 2014 9:51 PM | Updated on Sep 2 2017 7:48 AM

ఐపీఎల్ 7 లో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కోల్ కతా:ఐపీఎల్ 7 లో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

 

అనంతరం వేణు గోపాలరావు(27), సమీ(29), హోల్డర్(16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన కోల్ కతాకు ఈ మ్యాచ్ లో విజయం అవసరం కాకపోయినా, హైదరాబాద్ మాత్రం ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి  అవశ్యం ఏర్పడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement