ఫైనల్లో సానియా జంట | sania team in to final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జంట

May 17 2015 1:06 AM | Updated on Sep 3 2017 2:10 AM

ఫైనల్లో సానియా జంట

ఫైనల్లో సానియా జంట

గత రెండు టోర్నీల్లో విఫలమయ్యాక... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

న్యూఢిల్లీ : గత రెండు టోర్నీల్లో విఫలమయ్యాక... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జతగా ఈ ఇద్దరూ నాలుగో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన సానియా-హింగిస్ జంట శనివారం జరిగిన సెమీఫైనల్లో 6-2, 7-6 (7/5)తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరినా స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీపై గెలిచింది.

86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంటకు రెండో సెట్‌లో గట్టిపోటీ లభించినా కీలకమైన టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హింగిస్‌తో కలిసి ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్ ఓపెన్‌లలో డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా... స్టట్‌గార్ట్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో... మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement