సానియా జంటకు షాక్‌ | Sania Mirza-Barbora Strycova lose in Miami Open final | Sakshi
Sakshi News home page

సానియా జంటకు షాక్‌

Apr 4 2017 12:32 AM | Updated on Sep 5 2017 7:51 AM

సానియా జంటకు షాక్‌

సానియా జంటకు షాక్‌

ఈ ఏడాది రెండో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.

ఫ్లోరిడా (అమెరికా): ఈ ఏడాది రెండో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో సానియా –బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సానియా–స్ట్రికోవా జంట 4–6, 3–6తో అన్‌సీడెడ్‌ ద్వయం గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్‌ (చైనా) జంట చేతిలో ఓడింది. 

తొలిసారి జతగా ఆడిన తొలి టోర్నీలోనే దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్‌ జోడీ టైటిల్‌ సాధించడం విశేషం. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,87,970 డాలర్లు (రూ. కోటీ 22 లక్షలు)... విజేతగా నిలిచిన దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్‌ జోడీకి 2,85,170 డాలర్లు (రూ. కోటీ 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement