ఫైనల్లో సానియా-హింగిస్ జంట | Sania-Hingis in the final couple | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

Jul 11 2015 12:29 AM | Updated on Sep 3 2017 5:15 AM

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో

లండన్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. వింబుల్డన్‌లో సానియా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై కేవలం 56 నిమిషాల్లో గెలిచింది.

శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీతో సానియా జంట తలపడుతుంది. సానియా గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో పేస్-హింగిస్ జోడీ 6-3, 6-4తో మైక్ బ్రయాన్-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జంటపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement