మరోసారి నంబర్‌వన్‌గా సైనా | Saina number one againa | Sakshi
Sakshi News home page

మరోసారి నంబర్‌వన్‌గా సైనా

May 22 2015 12:38 AM | Updated on Sep 3 2017 2:27 AM

మరోసారి  నంబర్‌వన్‌గా సైనా

మరోసారి నంబర్‌వన్‌గా సైనా

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. గురువారం బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. గత నెలలో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా ఆ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందు తిరిగి టాప్ ర్యాంకును దక్కించుకుంది.

ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తను డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగబోతోంది. పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ ర్యాంకులో ఉంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ తన నాలుగో స్థానాన్ని.. పి.కశ్యప్, ప్రణయ్ తమ 13, 15వ స్థానాలను కాపాడుకున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జంట 21వ స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement