ముస్సోరిలో మాస్టర్.. | Sachin Tendulkar arrives in Mussoorie after retirement | Sakshi
Sakshi News home page

ముస్సోరిలో మాస్టర్..

Nov 20 2013 5:33 PM | Updated on Sep 2 2017 12:48 AM

ANI

ANI

అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరికి విచ్చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరికి విచ్చేశాడు. భార్య అంజలితో కలసి బుధవారం సచిన్ ఇక్కడికి చేరుకున్నాడు.

చార్టర్డ్ విమానంలో వచ్చిన ముంబైకర్ తన కుటుంబ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్ హోటల్లో బస చేశాడు. సచిన్కు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ముస్సోరి ఒకటి. డెహ్రాడూన్కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న హిల్ స్టేషన్కు మాస్టర్ తీరిక దొరికినపుడల్లా కుటుంబంతో కలసి ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడు. గతేడాది వన్డే క్రికెట్కు గుడ్ బై చెప్పిన అనంతరం కూడా ముస్సోరికి వచ్చాడు. ఇటీవల ముంబై వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు అనంతరం సచిన్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన వెంటనే మాస్టర్కే భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement