సల్మాన్తో పాటు సచిన్ | Sachin Tendulkar accepts IOA's invitation | Sakshi
Sakshi News home page

సల్మాన్తో పాటు సచిన్

May 3 2016 3:09 PM | Updated on Sep 3 2017 11:20 PM

సల్మాన్తో పాటు సచిన్

సల్మాన్తో పాటు సచిన్

రియో ఒలింపిక్స్లో భారత బృందానికి గుడ్విల్ అంబాసిడర్గా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పంపిన ఆహ్వానానికి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత బృందానికి గుడ్విల్ అంబాసిడర్గా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పంపిన ఆహ్వానానికి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అంబాసిడర్గా ఉండేందుకు సచిన్ సుముఖత వ్యక్తం చేస్తూ మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేశాడు. దీనివల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు భారత జట్టుకు గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఐఓఏ ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. అలాగే మేటి షూటర్ అభినవ్ బింద్రాను కూడా గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కూడా ఐఓఏ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement