'పార్దీవ్ పటేల్ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది' | RCB owner vijay malya lauds Parthiv is talented player | Sakshi
Sakshi News home page

'పార్దీవ్ పటేల్ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది'

Apr 20 2014 5:18 PM | Updated on Apr 6 2019 9:07 PM

'పార్దీవ్ పటేల్ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది' - Sakshi

'పార్దీవ్ పటేల్ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది'

నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్దీవ్ పటేల్ ను ఆ ప్రాంఛైజీ యజమాని విజయ్ మాల్యా పొగడ్తలతో ముంచెత్తాడు.

షార్జా: నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్దీవ్ పటేల్ ను ఆ ప్రాంఛైజీ యజమాని విజయ్ మాల్యా పొగడ్తలతో ముంచెత్తాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో పార్దీవ్,  డివిలియర్స్ లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించారని మాల్యా తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ అధికారిక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటూర్యూలో ఆయన పార్దీవ్ ను ప్రశంచించాడు. 'నాకు ఎప్పుడు పార్దీవ్ ఆటపై నమ్మకం ఉంది. అతను టాలెంట్ ఉన్న కుర్రాడు. ఆ విషయాన్ని కీలక ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు'. అని మాల్యా అన్నారు. డివిలియర్స్ తో కలిసి అతను ఆడిన తీరు ఆమోఘమని తెలిపారు.

విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి జట్టును కష్టాల్లోకి నెట్టిన తరుణంలో పార్దీవ్, డివిలియర్స్ లు నెలకొల్పిన చూడచక్కని ఇన్నింగ్స్ బెంగళూర్ కు  విజయాన్ని అందించింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement