ధోని జట్టుదే హాకీ టైటిల్ | ranchi race won in final | Sakshi
Sakshi News home page

ధోని జట్టుదే హాకీ టైటిల్

Feb 23 2015 12:59 AM | Updated on Sep 2 2017 9:44 PM

ధోని జట్టుదే హాకీ టైటిల్

ధోని జట్టుదే హాకీ టైటిల్

ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంటే... స్వదేశంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లోనూ ధోని జట్టు అదరగొట్టింది.

 హెచ్‌ఐఎల్ ఫైనల్లో నెగ్గిన రాంచీ
 న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంటే... స్వదేశంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లోనూ ధోని జట్టు అదరగొట్టింది. ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హెచ్‌ఐఎల్ మూడో సీజన్‌లో విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాంచీ జట్టు షూటవుట్స్‌లో 3-2తో పంజాబ్ వారియర్స్‌పై నెగ్గింది.
 
 మ్యాచ్ 39వ నిమిషంలో కీరన్ గోవర్స్ (పంజాబ్) గోల్ చేయగా... రాంచీ తరఫున స్టాన్లీ మింజ్ 42వ నిమిషంలో గోల్ సాధించాడు. క్రిస్టఫర్ సిరియెట్లో (56 వ  ని.) గోల్‌తో పంజాబ్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి నిమిషంలో మిడిల్‌టన్ గోల్‌తో రాంచీ ఊపిరి పీల్చుకుంది. స్కోరు 2-2తో సమం కావడంతో... మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఇందులో రాంచీ 3-2తో గెలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-1తో యూపీ విజార్డ్స్‌ను ఓడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement