రామ్‌కుమార్‌ ఓటమి  | Ramkumar defeat the match | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్‌ ఓటమి 

Feb 21 2018 1:32 AM | Updated on Feb 21 2018 1:32 AM

Ramkumar defeat the match - Sakshi

రామ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: డెల్‌రే బీచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. క్వాలిఫయర్‌ హోదాలో పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడిన అతను తొలి రౌండ్‌లో 1–6, 2–6తో ప్రపంచ 75వ ర్యాంకర్‌ డొనాల్డ్‌ యంగ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.

మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఓపెన్‌–13 ప్రావిన్స్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్‌ ద్వయం 2–6, 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కెన్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌)–స్టెఫానోస్‌ (గ్రీస్‌) జంటపై గెలిచింది.    

Advertisement
 
Advertisement
Advertisement