61వ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్ | Rafael Nadal wins Qatar Open to take 61st career title | Sakshi
Sakshi News home page

61వ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్

Jan 5 2014 9:04 AM | Updated on Sep 2 2017 2:19 AM

61వ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్

61వ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్

స్పానిష్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించాడు.

దోహా: స్పానిష్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించాడు. ఖతార్ ఎక్సాన్ మొబైల్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దోహాలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ప్లేయర్ గేయల్ మోన్పిల్స్ను 6-1, 6-7 (5-7), 6-2 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు.

నాదల్కు ఇది 61వ కెరీర్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో గతంలో ఇదే సిరీస్లో తనను రెండుసార్లు ఓడించిన గేయల్పై నాదల్ బదులు తీర్చుకున్నాడు. 2012 సెమీఫైనల్, 2009 క్వార్టర్ ఫైనల్లో నాదల్ను గేయల్ ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement