ఏర్పాట్లలో నిర్లక్ష్యం... ప్రాక్టీస్‌లో యువ రెజ్లర్‌ మృతి | practice of the death of the young wrestler neglect the preparation | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లలో నిర్లక్ష్యం... ప్రాక్టీస్‌లో యువ రెజ్లర్‌ మృతి

Mar 1 2017 12:41 AM | Updated on Sep 5 2017 4:51 AM

ఏర్పాట్లలో నిర్లక్ష్యం... ప్రాక్టీస్‌లో యువ రెజ్లర్‌ మృతి

ఏర్పాట్లలో నిర్లక్ష్యం... ప్రాక్టీస్‌లో యువ రెజ్లర్‌ మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువ రెజ్లర్‌ను బలి తీసుకుంది. నిర్ణీత ప్రమాణాల్లేని ఫ్లోర్‌పై ప్రాక్టీస్‌ పోటీల సందర్భంగా 19 ఏళ్ల వికాస్‌ ..

పుణే: నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువ రెజ్లర్‌ను బలి తీసుకుంది. నిర్ణీత ప్రమాణాల్లేని ఫ్లోర్‌పై ప్రాక్టీస్‌ పోటీల సందర్భంగా 19 ఏళ్ల వికాస్‌ బాలు సస్థే మృతి చెందాడు. ఇక్కడి జమాలీ గ్రామానికి చెందిన అతను త్వరలో ముంబైలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల కోసం సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాడు. మంగల్వార్‌ పేఠ్‌ గ్రౌండ్‌లో ఎర్రటి ఎండలో ఏర్పాటు చేసిన నాసిరకపు ఫ్లోర్‌పై శనివారం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని వెన్నెముకకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు.

వెన్నెముక గాయంతో పాటు మెదడు, గుండె పోటుతో అతను మృతి చెందాడని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. సిమెంట్‌ బెడ్‌తో ఏర్పాటు చేసిన ఈ ఫ్లోర్‌పై కుషన్‌లాంటి మ్యాట్‌లను కాకుండా ప్లాస్టిక్‌ మ్యాట్‌లను వాడటం వల్లే అతను గాయపడినట్లు విచారణలో తేలింది. ఎండ వేడిమికి ప్లాస్టిక్‌ మ్యాట్లు కరగడంతో అతని వీపు బలంగా సిమెంట్‌ బెడ్‌కు తాకడం వల్లే వికాస్‌ మృతి చెందాడు. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను కూడా అందుబాటులో ఉంచకుండా ట్రయల్స్‌ జరపడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement