అండర్‌ 19 వరల్డ్‌ కప్‌: కివీస్‌ శుభారంభం | New Zealand beat WI by 8 wickets in ICC U 19 Cricket World Cup | Sakshi
Sakshi News home page

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌: కివీస్‌ శుభారంభం

Jan 13 2018 3:21 PM | Updated on Jan 13 2018 3:22 PM

New Zealand beat WI by 8 wickets in ICC U 19 Cricket World Cup - Sakshi

తౌరాంగా(న్యూజిలాండ్‌):అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని  విభాగాల్లో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 39.3 ఓవర్లలో రెండు వికెట్లతో ఛేదించి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో అలెన్‌(115 నాటౌట్‌) అజేయ శతకంతో సత్తాచాటి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు ఓపెనర్‌ భులా(83) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.  సిమ్మన్స్‌(92 నాటౌట్‌), మెలియస్‌(78) మినహా ఎవరూ ఆకట్టకోలేకపోవడంతో విండీస్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement