ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ | Jyothi Surekha to Archery World Cup | Sakshi
Sakshi News home page

ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ

Apr 22 2017 1:22 AM | Updated on Sep 5 2017 9:20 AM

ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ

ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ

విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ మేలో జరగనున్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొనే

హైదరాబాద్‌: విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ మేలో జరగనున్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన కాంపౌండ్‌ విభాగం సెలెక్షన్స్‌లో జ్యోతి 21 పాయింట్లకుగాను 16.5 పాయింట్లు స్కోర్‌ చేసి భారత జట్టులో చోటు దక్కించుకుంది. చైనాలో మే 16 నుంచి 21 వరకు జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–1 పోటీలతో పాటు, జూన్‌ 6 నుంచి 11వరకు టర్కీలో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–2 పోటీల్లో జ్యోతి సురేఖ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement