కెనడాపై భారత్ ఘనవిజయం | Indian women's hockey team win second tie of US tour | Sakshi
Sakshi News home page

కెనడాపై భారత్ ఘనవిజయం

Jul 24 2016 1:29 AM | Updated on Apr 4 2019 3:21 PM

కెనడాపై భారత్ ఘనవిజయం - Sakshi

కెనడాపై భారత్ ఘనవిజయం

అమెరికా పర్యటనలో ఉన్న భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది.

మన్‌హీమ్ (అమెరికా): అమెరికా పర్యటనలో ఉన్న భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2తో సునాయాసంగా నెగ్గింది. వందన కటారియా (9, 51వ నిమిషాల్లో), దీపిక (38, 49) రెండేసి గోల్స్‌తో చెలరేగగా పూనమ్ రాణి (58) మరో గోల్ సాధించింది. కెనడా నుంచి స్టెఫానీ నోర్లాండర్ (17), బ్రెన్నీ స్టెయిర్స్ (38) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా విఫలమైంది. అయితే తొమ్మిదో నిమిషంలోనే వందన ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఇక చివరి క్వార్టర్‌లో భారత్ ఏకంగా మూడు గోల్స్‌తో దాడి చేసి కెనడాను కోలుకోనీయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement