సాహో సింధు! | Indian badminton star PV Sindhu jumps to career-best Rank | Sakshi
Sakshi News home page

సాహో సింధు!

Apr 6 2017 3:46 PM | Updated on Sep 5 2017 8:07 AM

సాహో సింధు!

సాహో సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ఘనత సాధించింది.

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ఘనత సాధించింది. తన కెరీర్ లో బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. ప్రపంచ బ్మాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగసింది.

స్వదేశంలో ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సింధు విజేతగా నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

ఈ సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న సింధు తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. మారిన్ మూడో ర్యాంకులో కొనసాగుతోంది. చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జుయింగ్ టాప్ ర్యాంకులో ఉంది. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్ 9వ ర్యాంకు దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement