ఇండోర్: డేవిస్‌కప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని మళ్లీ మెరిశాడు. భారత్ సంపూర్ణ విజయానికి తన వంతు సహకారం అందించాడు. దీంతో డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భారత్ 5-0తో చైనీస్ తైపీపై క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లే గెలిచారు. తెలుగు కుర్రాడు సాకేత్ 2-0 సెట్లతో సంగ్ హూ యంగ్‌పై, యూకీ బాంబ్రీ 2-0 సెట్లతో సియెన్ యిన్ పెంగ్‌పై జయభేరి మోగించారు. మొత్తం మీద ఓ జట్టుపై వైట్‌వాష్ సాధించడం 2005 తర్వాత భారత్‌కిదే తొలిసారి. తాజా విజయంతో ఏప్రిల్‌లో జరిగే రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదిస్తుంది.
సాకేత్ మెరుపులు
తాను ఆడుతున్న తొలి డేవిస్‌కప్ పోరులో సాకేత్ మైనేని సత్తాచాటుకున్నాడు. శనివారం డబుల్స్‌లో అదరగొట్టిన ఈ ఏపీ ఆటగాడు ఆదివారం సింగిల్స్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 26 ఏళ్ల మైనేని తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడు సంగ్ హూ యంగ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ 313వ ర్యాంకర్ సాకేత్ 6-1, 6-4తో కేవలం 48 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించడం విశేషం.
యూకీ ఖాతాలో మరో గెలుపు
తొలి సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చిన ఢిల్లీ ఆటగాడు యూకీ బాంబ్రీ రివర్స్ సింగిల్స్‌లోనూ తన జోరు కొనసాగించాడు. 22 ఏళ్ల యూకీ 7-5, 6-0తో సియెన్ యిన్ పెంగ్‌పై గెలుపొందాడు. ఇతను కూడా గంటలోపే (55 నిమిషాల్లోనే) ప్రత్యర్థిపై
జయకేతనం ఎగురవేశాడు. తొలి సెట్లో గట్టి పోటీనిచ్చిన పెంగ్ రెండో సెట్లో యూకీ బాంబ్రీ ధాటికి చేతులెత్తేశాడు.
‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ మ్యాజికే విజయాలందించింది. కేవలం ఐటీఎఫ్ టోర్నీలే కాకుండా ఇదే ఉత్సాహంతో ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయర్స్పై కూడా దృష్టిసారిస్తాను. ఫిట్నెస్ను కాపాడుకుంటూనే ఆటలో నైపుణ్యాన్ని సాధిస్తా’
- సాకేత్ మైనేని
భారత్ క్లీన్‌స్వీప్
Published Mon, Feb 3 2014 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
బాటిల్ విసిరిన ఆకతాయి.. సింగర్ రియాక్షన్ ఇదే!
పారిపోయిన సీఎం రమేష్
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement