సెమీస్‌లో ఢిల్లీ | Hockey India League: Delhi Waveriders Drub Kalinga Lancers to Enter Semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఢిల్లీ

Feb 18 2016 12:16 AM | Updated on Sep 3 2017 5:50 PM

సెమీస్‌లో ఢిల్లీ

సెమీస్‌లో ఢిల్లీ

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 6-0తో కళింగ లాన్సర్స్‌పై విజయం సాధించింది.

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 6-0తో కళింగ లాన్సర్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18, 33వ ని.) పెనాల్టీలను గోల్స్‌గా మల్చగా, సైమన్ చిల్డ్ (34వ ని.), పర్వీందర్ సింగ్ (56వ ని.)లు ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం) చేశారు. శనివారం జరిగే తొలి సెమీస్‌లో ఢిల్లీ... జేపీ వారియర్స్‌తో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement