జాక్సన్ ‘హ్యాట్రిక్’ | hockey india league | Sakshi
Sakshi News home page

జాక్సన్ ‘హ్యాట్రిక్’

Feb 7 2015 12:43 AM | Updated on Sep 2 2017 8:54 PM

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్ కెప్టెన్ ఆష్లే జాక్సన్ ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగాడు. మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాంచీ 4-0తో కళింగ లాన్సర్‌పై విజయం సాధించింది.

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్ కెప్టెన్ ఆష్లే జాక్సన్ ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగాడు. మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాంచీ 4-0తో కళింగ లాన్సర్‌పై విజయం సాధించింది.
 
 11వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన జాక్సన్... 32వ నిమిషంలో దాన్ని డబుల్ చేశాడు. మరో రెండు నిమిషాల తర్వాత విల్సన్ (34వ ని.) ఫీల్డ్ గోల్ చేయగా... 41వ నిమిషంలో  జాక్సన్ హ్యాట్రిక్ గోల్ చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement