జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ | Hamilton puts hammer down to win in Japan | Sakshi
Sakshi News home page

జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

Sep 27 2015 2:30 PM | Updated on Sep 3 2017 10:05 AM

జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 41వ ఫార్ములావన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

సుజుకా (జపాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 41వ ఫార్ములావన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. పోల్ పొజిషన్ సాధించిన మెర్సిడెస్ జట్టు మరో డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన వీరిద్దరూ ప్రధాన రేసును తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించి చివరివరకు తమ ఆధిక్యం కొనసాగించారు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు చెందిన 'ఫోర్స్ ఇండియా' జట్టు డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement