ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్ | final ranchi race | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్

Feb 22 2015 1:37 AM | Updated on Sep 2 2017 9:41 PM

ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్

ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్, పంజాబ్ వారియర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్, పంజాబ్ వారియర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తుది పోరు నేడు (ఆదివారం) జరుగనుంది. లీగ్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన రాంచీ రేస్... శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌పై పెనాల్టీ షూటవుట్స్ (9-8)లో నెగ్గింది.
 
 నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. యూపీ తరఫున డ్రాగ్‌ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ (34వ ని.), రాంచీ నుంచి ఆష్లే జాక్సన్ (41వ ని.) గోల్స్ చేశారు. ఆ తర్వాత పెనాల్టీ షూటవుట్స్‌లోనూ ఫలితం తేలక 3-3తో స్కోరు సమమైంది. చివరకు సడెన్ డెత్‌లో రాంచీ రేస్ గట్టెక్కింది. ఇక మరో సెమీస్‌లో పంజాబ్ వారియర్స్ 2-0తో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. సందీప్ సింగ్ (3వ ని.), ఆగస్టిన్ మజిలీ (35వ ని.) గోల్ చేశారు. మరోవైపు మూడో స్థానం కోసం ఢిల్లీ, విజార్డ్స్  తలపడనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement