హారిక గేమ్ డ్రా | Dronavalli Harika in semifinals; Koneru Humpy forces tiebreaker | Sakshi
Sakshi News home page

హారిక గేమ్ డ్రా

Mar 30 2015 2:33 AM | Updated on Sep 2 2017 11:33 PM

హారిక గేమ్ డ్రా

హారిక గేమ్ డ్రా

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్ రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకుంది.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్ రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకుంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. సోమవారం వీరిద్దరి మధ్యే  రెండో గేమ్ జరుగుతుంది.

ఈ గేమ్‌లో హారిక తెల్లపావులతో ఆడనుండటం ఆమెకు అనుకూలాంశం. ఈ గేమ్‌లో నెగ్గినవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement