డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు | David Warner Fastest 4000 ODI runs for australia | Sakshi
Sakshi News home page

డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు

Jun 6 2017 3:32 PM | Updated on Sep 5 2017 12:57 PM

డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు

డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు

గతకొంతకాలంగా భీకరమైన ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సాధించాడు.

లండన్: గతకొంతకాలంగా భీకరమైన ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్ లో నాలుగువేల పరుగుల్ని పూర్తి చేసుకుని ఆ ఘనతను వేగవంతంగా సాధించిన ఆసీస్ క్రికెటర్ గా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు.  చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం  బంగ్లాదేశ్ జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఈ ఫీట్ను వార్నర్ సాధించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో వార్నర్  40 పరుగులతో అజేయంగా నిలిచాడు.

 

వన్డే ఫార్మాట్ లో నాలుగువేల పరుగుల్ని సాధించడానికి వార్నర్ కు అవసరమైన ఇన్నింగ్స్ 93. ఇది ఆసీస్ తరపున ఫాస్టెస్ ఇన్నింగ్స్. కాగా, ఈ ఘనతను వేగవంతంగా సాధించిన క్రికెటర్ల పరంగా చూస్తే కోహ్లితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. అయితే సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు వరుణుడు శాపంగా మారాడు. ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు వద్ద ఉండగా భారీ వర్షం పడటంతో మ్యాచ్ రద్దయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement