ముంబై ఇండియన్స్ పై చెన్నై విజయం | chennai super kings beats mumbai indians by 4 wickets | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్ పై చెన్నై విజయం

May 10 2014 11:30 PM | Updated on Sep 2 2017 7:11 AM

ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముంబై: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  ముంబై ఇండియన్స్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో చెన్నైఇన్నింగ్స్ ను ఓపెనర్లు మెక్ కల్లమ్, స్మిత్ లు ధాటిగా ఆరంభించారు. మెక్ కల్లమ్(13) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం స్మిత్ కు రైనా జతకలవడంతో చెన్నై స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ తరుణంలో రైనా (19) పరుగుల వద్ద అవుటయ్యి అభిమానులకు షాకిచ్చాడు.

 

తరువాత డుప్లెసిస్ (31), స్మిత్ (57) పరుగులతో చెన్నైను విజయం దిశగా తీసుకువెళ్లారు. వీరివురూ అవుటయ్యాక ధోని(22)పరుగులతో నాటౌట్ గా నిలిచి చెన్నై ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో ప్రవీణ్ కుమార్, మలింగాలకు తలో రెండు వికెట్లు లభించగా, పొలార్డ్ కు ఒక వికెట్టు దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement