తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి | Anand wins, Harikrishna shocked in World Cup Chess opener | Sakshi
Sakshi News home page

తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి

Sep 4 2017 1:01 AM | Updated on Sep 17 2017 6:20 PM

తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి

తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు...

తిబిలిసి (జార్జియా): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు ఓటమి ఎదురైంది. యూరీ గొంజాలెజ్‌ విడాల్‌ (క్యూబా)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో హరికృష్ణ నల్లపావులతో ఆడుతూ 36 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఆశలు సజీవంగా ఉండాలంటే సోమవారం గొంజాలెజ్‌తో జరిగే రెండో గేమ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు విశ్వనాథన్‌ ఆనంద్‌ 66 ఎత్తుల్లో తియాన్‌ లి యో (మలేసియా)పై గెలిచి శుభారంభం చేశాడు.

ఇతర తొలి రౌండ్‌ గేముల్లో రుస్లాన్‌ పొనోమరియోవ్‌ (ఉక్రెయిన్‌)తో సేతురామన్‌ 16 ఎత్తుల్లో; ఎన్గుయెన్‌ త్రుయోంగ్‌ సన్‌ (వియత్నాం)తో ఆదిబన్‌ 15 ఎత్తుల్లో; వాంగ్‌ హావో (చైనా)తో దీప్‌ సేన్‌గుప్తా 34 ఎత్తుల్లో; డెల్గాడో రమిరేజ్‌ (పరాగ్వే)తో విదిత్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. వలేజో పోన్స్‌ (స్పెయిన్‌)తో జరిగిన గేమ్‌లో కార్తికేయన్‌ మురళి 64 ఎత్తుల్లో ఓటమి చవిచూశాడు.

Advertisement
 
Advertisement
Advertisement