మాస్టర్‌తో కలిసి ఆడతా: లారా | A few hours too late, Brian Lara misses Sachin Tendulkar's Eden farewell | Sakshi
Sakshi News home page

మాస్టర్‌తో కలిసి ఆడతా: లారా

Nov 11 2013 12:39 AM | Updated on Sep 2 2017 12:30 AM

మాస్టర్‌తో కలిసి ఆడతా: లారా

మాస్టర్‌తో కలిసి ఆడతా: లారా

ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడకపోవడం తన కెరీర్‌లో లోటు అని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు.

కోల్‌కతా: ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడకపోవడం తన కెరీర్‌లో లోటు అని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. అయితే భవిష్యత్‌లో సచిన్, గంగూలీతో కలిసి వెటరన్ మ్యాచ్ నిర్వహిస్తే ఇక్కడ ఆడేందుకు సిద్ధమని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారులకు తెలిపాడు.
 
  సచిన్ వీడ్కోలు సిరీస్‌ను తిలకించేందుకు క్యాబ్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చిన లారా ఆదివారం తన స్నేహితుడితో కలిసి 15 నిమిషాల పాటు ఈడెన్‌ను సందర్శించాడు. పిచ్, డ్రెస్సింగ్ రూమ్‌లను పరిశీలించి అక్కడే ఉన్న మైదానం సిబ్బందితో కలిసి ఫొటోలు దిగాడు. టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సచిన్ మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటోలకు ఫొజిచ్చాడు. తర్వాత ఏజేసీ బోస్ రోడ్‌లో ఉన్న మదర్ థెరిస్సా హౌస్‌ను సందర్శించి నివాళులు ఆర్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement