తప్పు చేశాం.. క్షమించండి..!

Girl Abused Dalits Apologizes After Backlash Beg To Take Down Viral Clip - Sakshi

న్యూఢిల్లీ : దళితులు, నిమ్న కులస్తులపై మంగళవారం అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ యువతి తీవ్ర విమర్శల నేపథ్యంలో క్షమాపణలు కోరారు. రిజర్వేషన్ల కారణంగా తక్కువ జాతివారు తమ తలపై వచ్చి కూర్చుంటున్నారని, దళితుల వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదంటూ ఆమె అసభ్యంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలను తిడుతూ తన మిత్రుడితో కలసి వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. తీవ్ర విమర్శలు రావడంతో వారిరువురు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఈమేరకు మరో వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో అలా మట్లాడానని యువతి చెప్పుకొచ్చారు. దయచేసి తనపై అసభ్యకర కామెంట్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఏ మతాన్ని, కులాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆ అసభ్యకర వీడియో బదులుగా.. తాజా వీడియోను షేర్‌ చేయండని కోరారు.

(చదవండి : వైరల్‌ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!)

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top