5 రోజులు.. 9 శిబిరాలు | Sakshi
Sakshi News home page

5 రోజులు.. 9 శిబిరాలు

Published Sat, Sep 23 2017 2:00 AM

Uttam kumar reddy comments on trs government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇందిరమ్మ రైతు బాట’ పేరిట టీపీసీసీ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శిబిరాలు శుక్రవారం ముగిశాయి. పాత 9జిల్లాలు యూనిట్‌గా జరిగిన శిబిరాల్లో దాదాపు 30వేల మంది కార్యకర్తలు, మండల స్థాయి నేతలకు వివిధ అంశాలపై శిక్షణనిచ్చా రు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న ప్రారంభమైన ఈ శిబిరాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలంతా ఐక్యంగా పనిచేయడం పార్టీ శ్రేణులకు ఉత్సా హాన్నిచ్చింది. ఈ నెల 18న కరీంనగర్, సంగా రెడ్డి (మెదక్‌)లో మొదలైన శిక్షణ శిబిరాలు.. 19న డిచ్‌పల్లి(నిజామాబాద్‌), ఉట్నూరు (ఆదిలాబాద్‌), 20న పరిగి(రంగారెడ్డి), మహబూబ్‌నగర్, 21న ఖమ్మం, సూర్యాపేట (నల్లగొండ), 22న వరంగల్‌లో జరిగాయి. శిబిరాల్లో భూమికి సంబంధించిన అంశాల్లో రైతులు, నిర్వాసితులు, ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు, పరిష్కారాలపై కార్యకర్తలు, నేతలకు సమాచారం అందించారు. భూమి స్వభావం, చట్టాలకు సంబంధించిన అంశాల ను వివరించి కరదీపికలు అందించారు. బూత్‌ స్థాయి నుంచి ఏఐసీసీ వరకు సమా చార మాధ్యమంగా పనిచేస్తున్న శక్తి యాప్‌ గురించి అవగాహన కల్పించారు.

టీఆర్‌ఎస్‌ హామీలపై నిలదీసేందుకు..
టీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులు, రికార్డుల ప్రక్షాళన, రైతు సమన్వయ సమితులకు సంబంధించిన అంశాలను కార్యకర్తలకు వివరిం చారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై ప్రభుత్వా న్ని నిలదీయడానికి, ప్రజల పక్షాన నిలబ డటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించా రు. టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తున్న రైతు సమ న్వయ సమితులకు దీటుగా రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసి, అర్హులకు అన్యాయం జరగకుండా శిక్షణ తీసుకున్న వారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్‌ 28 వరకు సదస్సులు..?
మండల స్థాయిలోనూ శిబిరాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ యోచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్‌ 28 వరకు నిరంతరంగా ఇలాంటి సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఒకే వేదికపైకి అగ్రనేతలు
కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఈ శిక్షణ శిబిరాల్లో పార్టీ రాష్ట్రనేతలంతా దాదాపు అన్ని వేదికలపై కనిపించారు. అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు, వ్యక్తిగత వైషమ్యాలకు వేదికైన కాంగ్రెస్‌లో నేతలం తా ఐక్యతారాగం ఆలపించడం పార్టీ దిగువ స్థాయి నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పార్టీ నేతలంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, సతీశ్, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, విపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీతో పాటు జిల్లాల వారీగా అన్ని గ్రూపుల నేతలు శిబిరాలకు హాజరయ్యారు.

Advertisement
Advertisement