త్వరలో కీలక నిర్ణయం? | Rajini back to Himalayas about Politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల కోసం హిమాలయాలకు రజనీ

Oct 7 2017 8:11 AM | Updated on Sep 17 2018 4:56 PM

Rajini back to Himalayas about Politics - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో తమ సత్తా చాటేందుకు అగ్ర హీరోలు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ఆరంగ్రేటం గురించి క్లారిటీ ఇచ్చిన కమల్‌ హాసన్‌ నేడో.. రేపో... పార్టీపై ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా.. సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 

తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో రజనీ హిమాలయాలకు వెళ్లటం తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు ధ్యానంలో మునిగిపోయాక తిరిగి వచ్చి కీలక నిర్ణయాలు తీసుకోవటం తలైవాకు పరిపాటే. అయితే అనారోగ్య కారణాల రీత్యా గత కొన్నేళ్లుగా ఆయన ఆ పని చేయటం లేదు. తిరిగి కాలా చిత్రం షూటింగ్ తర్వాత రజనీ తిరిగి అక్కడికే వెళ్లబోతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకునేందుకే ఆయన హిమాలయాలకు వెళ్లబోతున్నాడని తమిళనాట చర్చించుకుంటున్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని రజనీ గతంలో అభిమానుల సమక్షంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దైవ ధ్యానం తర్వాతే రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై స్పష్టత ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement