ప్రతిసారీ కొత్త ప్రత్యర్థి.. | Sakshi
Sakshi News home page

ప్రతిసారీ కొత్త ప్రత్యర్థి..

Published Fri, Nov 16 2018 3:09 AM

Profile of etela rajender in Telangana Elections 2018 - Sakshi

‘రాజేందర్‌ అన్న’ అని ప్రజలతో పిలిపించుకుంటూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు మంత్రి ఈటల రాజేందర్‌. చినప్పటి నుంచే వామపక్ష భావాలు కలిగిన ఈటల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరి ఉద్యమమే ఊపిరిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును పొందారు. విద్యార్థి దశ నుంచి ప్రజల కష్టాలను దగ్గరగా  చూసిన ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గత పాలకుల పద్ధతులకు స్వస్తి పలికి ప్రజలకు ఎంతో చేరువయ్యారు.

నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజల బాగోగులు ఆరా తీసి, పూర్తి సమయాన్ని ప్రజలకే కేటాయిస్తారనే పేరుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి ఎరుగని ముద్దసాని దామోదర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ  విశేషమేంటంటే...ఈటల రాజేందర్‌పై ప్రతి ఎన్నికల్లో గతంలో తనపై పోటీ చేసిన వారు తిరిగి నిలబడలేదు. ప్రతిసారి కొత్త వారు  ప్రత్యర్థిగా నిలబడినా ఈటలను ఓడించలేకపోయారు.

ఈ ఎన్నికల్లో తను చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్‌లో తన సమీప ప్రత్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై 57,037 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ ప్రత్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. కాంగ్రెస్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి సీటు ఆశిస్తూ నామినేషన్‌ దాఖలు చేశారు.  కానీ ఆయనకు అధిష్టానం ఇంకా  టికెట్‌ ఖరారు చేయలేదు. కూటమి నుంచి వేరే అభ్యర్థిని కూడా ఇక్కడ నిలిపే ఛాన్స్‌  ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.


అమలవుతున్న పథకాలు
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ,  సబ్సిడీ గొర్రెల పంపిణీ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఫించన్‌లు, కేసీఆర్‌ కిట్లు, హరితహారం,  హస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ.  

ప్రత్యేకతలు
రూ.717 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.65 కోట్లతో స్కూల్, కాలేజి భవనాలు నిర్మించారు. రూ.69 కోట్లతో హాస్టల్‌ భవనాలు, రూ.2 కోట్లతో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు
 రూ.158 కోట్లతో మిషన్‌ కాకతీయ కింద చెరువుల బాగు
 రూ.64 కోట్లతో చెక్‌డ్యాంలు, రూ.429 కోట్లతో పంచాయతీరాజ్‌ పనులు  
 రూ.42 కోట్లతో ఆసుపత్రి భవన నిర్మాణాలు, రూ.10 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
♦  రూ.223 కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు  

ప్రధాన సమస్యలు
 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం నత్తనడక
 ఉప్పల్, బిజిగిరిషరీఫ్‌ గ్రామాల్లో పూర్తి కానీ  ఫ్లైఓవర్‌ నిర్మాణాలు
 హుజూరాబాద్‌లో అంబేద్కర్‌ కూడలి ఆధునీకరణ పనులు
 కొనసాగుతున్న మోడల్‌ చెరువు నిర్మాణం పనులు  

సిట్టింగ్‌ ప్రొపైల్‌
♦  2002లో రాజకీయ ఆరగేంట్రం. 2004లో కమలాపూర్‌  నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటి చేసి విజయం సాధించారు.  
  వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో హుజూరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  
 2014 ఎన్నికల్లో విజయం సాధించి...తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement
Advertisement