కేంద్రమంత్రికి.. క్యాబిన్ క్రూ ఉద్యోగం రాలేదట.. | When Smriti Irani was denied cabin crew job for 'lack of good personality' | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి.. క్యాబిన్ క్రూ ఉద్యోగం రాలేదట..

Aug 25 2016 2:20 PM | Updated on Oct 22 2018 2:09 PM

సరైన పర్సనాలిటీ లేకపోవడంవల్లే జెట్ ఎయిర్ వేస్ కే నన్ను తిరస్కరించి ఉంటుందని భావించానని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

న్యూఢిల్లీః ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రముఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. కెరీర్ మొదట్లో క్యాబిన్ క్రూ ఉద్యోగానికి అప్లై చేస్తే తిరస్కరించారట. జెట్ ఎయిర్ వేస్ తన ధరఖాస్తును రిజెక్ట్ చేసిందని, సరైన పర్సనాలిటీ లేకపోవడంతోనే తనను ఆ ఉద్యోగానికి ఎంపిక చేయలేదంటూ.. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్శంలో స్మృతీ గుర్తు చేసుకున్నారు.

జెట్ ఎయిర్ వేస్ నా ధరఖాస్తును రిజెక్ట్ చేసిన అనంతరం మెక్ డొనాల్డ్ లో ఉద్యోగం సంపాదించానని, అయితే నాకు సరైన పర్సనాలిటీ లేకపోవడంవల్లే జెట్ ఎయిర్ వేస్ నన్ను క్యాబిన్ క్రూ ఉద్యోగానికి తిరస్కరించి ఉంటుందని భావించానని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఎయిర్ పాసింజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు వేడుకలకు ఓ పాసింజర్ గా హాజరైన టెక్స్టైల్ మినిస్టర్.. సరదాగా  తన క్యాబిన్ క్రూ ఉద్యోగం పూర్వాపరాలను వివరించారు. 

తనకు క్యాబిన్ క్రూ ఉద్యోగం రాకపోవడమే మంచిదయ్యిందని, అనంతరం మెక్ డొనాల్డ్ లో ఉద్యోగం సంపాయించడంతోపాటు.. రాజకీయ జీవితంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించగలిగానని పొలిటీషియన్ గా మారిన టీవీ ఆర్టిస్టు స్మృతి ఇరానీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement