breaking news
cabin crew job
-
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
విమానంలో ఉద్యోగం చాలామందికి డ్రీమ్ జాబ్. ముఖ్యంగా విమానంలో ప్రయాణికులందరినీ చిరునవ్వుతో పలకరించే క్యాబిన్ క్రూ ఉద్యోగం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, విమానయాన రంగంలో కెరీర్.. ఇలా ఎన్నో ఆకర్షణలు ఈ ఉద్యోగంలో ఉన్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నవారు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2026లో అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవాన్ని బట్టి ఇండిగో క్యాబిన్ క్రూ సంపాదనలెంతో ఈ కథనంలో తెలుసుకుందాం..కొత్తగా చేరేవారికి ఇలా..ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం, ఇండిగోలో కొత్తగా క్యాబిన్ క్రూగా చేరినవారు సాధారణ ఫ్లయింగ్ డ్యూటీలు ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించవచ్చు. అయితే ఇది స్థిరమైన జీతంగా భావించకూడదు. ఫ్లయింగ్ గంటలు, నెలవారీ రోస్టర్, రూట్, ప్రోత్సాహకాలు, పనిచేసే బేస్ లొకేషన్ వంటి అంశాల ఆధారంగా అసలు నెలవారీ ఆదాయం మారవచ్చు.అనుభవం పెరిగితే..రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం, ఎక్కువ ఫ్లయింగ్ యాక్టివిటీ ఉన్న క్యాబిన్ క్రూకు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవజ్ఞులైన సిబ్బంది నెలకు రూ.60,000–రూ.85,000 వరకు సంపాదించవచ్చు. ఇందులో ఫ్లయింగ్ అలవెన్సులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు, రూట్ అసైన్మెంట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నెలా వచ్చే మొత్తం ఒకేలా ఉండకపోవచ్చు.సీనియర్ స్థాయిలో రూ.1.2 లక్షల వరకు..కెరీర్లో ముందుకు వెళ్లి లీడ్ క్యాబిన్ అటెండెంట్ లేదా ఇన్‌ఫ్లైట్ సూపర్వైజర్ వంటి బాధ్యతలు చేపట్టినవారికి ఆదాయం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏవియేషన్ A2Z అంచనా వేసింది. బలమైన ఫ్లయింగ్ షెడ్యూల్, అధిక బాధ్యతలు ఉన్న సమయంలో వీరి నెలవారీ సంపాదన సుమారు రూ.90,000 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చు.జీతంతో పాటు మరిన్ని ప్రయోజనాలుక్యాబిన్ క్రూ ఆదాయం కేవలం బేసిక్ పేకు పరిమితం కాదు. ఫ్లయింగ్ అలవెన్సులు, కొన్ని సందర్భాల్లో లేఓవర్ సంబంధిత ప్రయోజనాలు, స్టాఫ్ ట్రావెల్ వంటి సదుపాయాలు మొత్తం ప్యాకేజీలో భాగం కావచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ రూట్, డ్యూటీ స్వభావం కూడా ఆదాయంపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.మూడు నెలల శిక్షణ తప్పనిసరిఇండిగో అధికారిక సమాచారం ప్రకారం, విమానంలో ఫ్లయింగ్ క్రూగా విధులు ప్రారంభించే ముందు క్యాబిన్ క్రూ సిబ్బంది మూడు నెలలపాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ పొందుతారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, సేవా ప్రమాణాలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. -
కేంద్రమంత్రికి.. క్యాబిన్ క్రూ ఉద్యోగం రాలేదట..
న్యూఢిల్లీః ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రముఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. కెరీర్ మొదట్లో క్యాబిన్ క్రూ ఉద్యోగానికి అప్లై చేస్తే తిరస్కరించారట. జెట్ ఎయిర్ వేస్ తన ధరఖాస్తును రిజెక్ట్ చేసిందని, సరైన పర్సనాలిటీ లేకపోవడంతోనే తనను ఆ ఉద్యోగానికి ఎంపిక చేయలేదంటూ.. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్శంలో స్మృతీ గుర్తు చేసుకున్నారు. జెట్ ఎయిర్ వేస్ నా ధరఖాస్తును రిజెక్ట్ చేసిన అనంతరం మెక్ డొనాల్డ్ లో ఉద్యోగం సంపాదించానని, అయితే నాకు సరైన పర్సనాలిటీ లేకపోవడంవల్లే జెట్ ఎయిర్ వేస్ నన్ను క్యాబిన్ క్రూ ఉద్యోగానికి తిరస్కరించి ఉంటుందని భావించానని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఎయిర్ పాసింజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు వేడుకలకు ఓ పాసింజర్ గా హాజరైన టెక్స్టైల్ మినిస్టర్.. సరదాగా తన క్యాబిన్ క్రూ ఉద్యోగం పూర్వాపరాలను వివరించారు. తనకు క్యాబిన్ క్రూ ఉద్యోగం రాకపోవడమే మంచిదయ్యిందని, అనంతరం మెక్ డొనాల్డ్ లో ఉద్యోగం సంపాయించడంతోపాటు.. రాజకీయ జీవితంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించగలిగానని పొలిటీషియన్ గా మారిన టీవీ ఆర్టిస్టు స్మృతి ఇరానీ తెలిపారు.


