భయానికి కేరాఫ్ ఈ బాత్రూమ్.. | the bathroom In the first place in fear | Sakshi
Sakshi News home page

భయానికి కేరాఫ్ ఈ బాత్రూమ్..

Jul 4 2014 3:29 AM | Updated on Sep 2 2017 9:46 AM

భయానికి కేరాఫ్ ఈ బాత్రూమ్..

భయానికి కేరాఫ్ ఈ బాత్రూమ్..

నిజంగానే మీరు భయపడాలంటే.. ఈ బాత్రూమ్‌లోకి వెళ్లాల్సిందే. సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో.. అదీ కొండంచున.. పడిపోతున్నట్లు ఉన్న ఈ మరుగుదొడ్డి సైబీరియాలోని కారాట్యూరెక్‌లో ఉన్న అల్టాయ్ పర్వతాల్లో ఉంది.

నిజంగానే మీరు భయపడాలంటే.. ఈ బాత్రూమ్‌లోకి వెళ్లాల్సిందే. సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో.. అదీ కొండంచున.. పడిపోతున్నట్లు ఉన్న ఈ మరుగుదొడ్డి సైబీరియాలోని కారాట్యూరెక్‌లో ఉన్న అల్టాయ్ పర్వతాల్లో ఉంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు దూరితే.. కూలిపోతుందేమో అన్నట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఇలాంటి ప్లేసులో దీన్ని ఎవరి కోసం నిర్మించారనేదేగా మీ డౌట్.. ఇక్కడ ఓ వాతావరణ కేంద్రం ఉంది. అందులో కేవలం ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

‘ప్రకృతి’ పిలిచినప్పుడల్లా వారు ఉపయోగించుకోవడానికే దీన్ని 1939లో నిర్మించారు. ఆ మధ్య బెలారస్‌కు చెందిన ఇంటర్‌ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ మరుగుదొడ్లపై నిర్వహించిన సర్వేలో.. భయం పుట్టించే బాత్రూమ్‌లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఇంటర్‌ఫ్యాక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఇందులోకి పోవాలంటే ఎవరైనా వణకాల్సిందే.. రోజూ దీన్ని ఉపయోగిస్తూ పోతూ ఉంటే.. కొన్నాళ్లకు ఇదంటే మీకు భయం తగ్గొచ్చు’ అని వ్యాఖ్యానించారంటేనే.. దీని కెపాసిటీ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement