నరేంద్ర మోడీ.. ఓ హిట్లర్: రాహుల్ గాంధీ | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ.. ఓ హిట్లర్: రాహుల్ గాంధీ

Published Tue, Mar 11 2014 6:40 PM

నరేంద్ర మోడీ.. ఓ హిట్లర్: రాహుల్ గాంధీ - Sakshi

అహ్మదాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వంటి వారంటూ ఆయన స్వరాష్ట్రంలోనే  రాహుల్ విమర్శించారు. అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడేందుకు కాపాలదారుగా ఉంటాననంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దేశానికి ఆ అవసరం లేదని చెప్పారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని ఎందుకు స్థాపిస్తున్నారోనంటూ, బీజేపీకి ఓ విధానమంటూ లేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల సిద్ధాంతాలను పాటించదని అన్నారు. రెండు రకాల నాయకులున్నారని, గాంధీజీ వంటి మొదటి రకం నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటారని రాహుల్ చెప్పారు. ఇక హిట్లర్ వంటి రెండో రకం నాయకులు ప్రజల వద్దకు వెళ్లరని, ప్రపంచమంతా తమకు మాత్రమే తెలుసనే గర్వంతో ఉంటారని అన్నారు.

Advertisement
Advertisement